*ప్రశంసా పత్రాలను అందజేసిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం విజ్ఞప్తిమేరకు చేపట్టిన సుమారు 12 లక్షల క్రియాశీలక సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో, రాష్ట్రవ్యాప్తంగా 15,000 మంది వాలంటీర్లకు ఈ కార్డులను విభజించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపుదిద్దుకుంది. ఈ విభిన్న కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం ఐటీ విభాగానికి కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం లభించగా, మగటపల్లి గ్రామానికి చెందిన చింతక్రింద శ్రీనివాస్, వలవల రమేష్‌లు కేంద్ర కార్యాలయం అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తిచేయగా, వారి అంకితభావాన్ని ప్రశంసిస్తూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన ప్రశంసా పత్రాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా దిరిశాల బాలాజీ, తాడి మోహన్, దొడ్డ జైరామ్, గంటా నాయుడు తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment