*ఆలూరు నియోజకవర్గ జనసేన నాయకురాలు ఎరుకలు పార్వతి
జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో జిల్లాల జనసేన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఆలూరు నియోజకవర్గ జనసేన నాయకురాలు ఎరుకలు పార్వతి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుండగా, వైసీపీ మాత్రం మైండ్ గేమ్‌లతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనేకసారి పార్టీ ప్రెస్ నోట్‌ల ద్వారా వైసీపీ మాయ జాలాలకు జనసైనికులు బలవకూడదని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో, పవన్ కళ్యాణ్ గారు పార్టీ వ్యవస్థాపక లక్ష్యాలు, ప్రజల సమస్యల పరిష్కారాలపై దృష్టిసారించి సమీక్షా సమావేశం ద్వారా నాయకులకు మార్గనిర్దేశం చేసే అవకాశముందని ఆమె అన్నారు.
ప్రత్యేకించి కూటమి విజయంపై ప్రభావం చూపిన నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయన్న అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని ఎరుకలు పార్వతి వివరించారు.
Share this content:
Post Comment