ఏడాదిలో 11 కోట్లు వెచ్చించిన పవన్ కళ్యాణ్

*జనసేనలో క్రియాశీలతకి నిదర్శనం’చాయి జనసైనిక్స్’

డిప్యూటీ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టి ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.11 కోట్లను తన సొంత నిధుల నుంచి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేసిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, జనసేన పార్టీకి సేవ చేయడం గర్వకారణమని గునుకుల కిషోర్ తెలిపారు. నెల్లూరు నగరంలో “చాయి జనసైనిక్స్” కార్యక్రమం 9వ రోజులో భాగంగా 11వ డివిజన్ ఇంచార్జ్ సత్య ఆధ్వర్యంలో మూడు జెండాల సెంటర్, ఎన్టీఆర్ నగర్ పరిసరాల్లో చురుకుగా సాగింది. ఇటీవలి కాలంలో పార్టీకి పనిచేసిన వెంకటరమణ తదితరులు మళ్లీ జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపడం సంతోషకరమని పేర్కొన్నారు. జిల్లా పర్యవేక్షకులు, క్రమశిక్షణ విభాగం హెడ్, జాతీయ మీడియా ప్రతినిధి మరియు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ తో చర్చించి వీరిని కార్యకలాపాల్లో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, జిల్లా కార్యాలయ ఇంచార్జ్ జమీర్‌తో పాటు పలువురు నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment