కార్యకర్తల్ని కన్నబిడ్డల్లా చూసుకునే నాయకుడు పవన్ కళ్యాణ్

*జనసేన సభ్యత్వం గర్వకారణం
*జనసేన రాష్ట్ర నాయకులు నాయబ్ కమాల్, కిలారి రోశయ్య

పార్టీ సిద్ధాంతాలు, సమాజహితం పట్ల అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నబిడ్డల్లా ఆదరిస్తారని రాష్ట్ర నాయకులు నాయబ్ కమాల్, మాజీ శాసనసభ్యులు కిలారి రోశయ్య పేర్కొన్నారు. పత్తిపాడు సమన్వయకర్త ఆళ్ళ హరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలోని ఏ రాజకీయ పార్టీకీ లేని విధంగా సభ్యత్వంతోపాటు ప్రమాద భీమా అందించే ఏకైక పార్టీ జనసేన అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన సిద్ధాంతాలు ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయని, నీతి–నిజాయితీతో సమాజంలో మార్పు కోరే ప్రతి యువకుడికి ఈ సభ్యత్వం గర్వకారణమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం తెలుగు రాజకీయాల్లో విలక్షణ ధోరణికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొని నేతల మాటలకు సంఘీభావం తెలిపారు.

Share this content:

Post Comment