పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అవ్వాలని శ్రీరాజశ్యామల యాగం: బొర్రా

సత్తెనపల్లి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని, దానికోసమే చేజర్ల కపోతేశ్వర దేవస్థానంలో శ్రీశతకుండాత్మక మహారుద్ర, శతసహస్ర మహాచండీసహిత, శ్రీరాజశ్యామల యాగం చేస్తున్నానని సత్తెనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటానికి ఏమి చేయడానికైనా సిద్ధమని బొర్రా అన్నారు. జనసేన మహా పాదయాత్రను ఏ విధంగా జయప్రదం చేశారో, అలానే శ్రీరాజశ్యామల యాగాన్ని కూడా జయప్రదం చేయాలని జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఐదు నుండి తొమ్మిదవ తారీఖు వరకు చేజర్ల కపోతేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ రాజశేమల యాగం జరుగుతుందన్నారు.