సిరివెళ్లకు పవన్ కళ్యాణ్ రాకతో వైసీపీలో వణుకు

-జనసేనాని రాకతో వైసీపీకి కౌలు రైతులు గుర్తుకు వచ్చారా?

ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ 8 వ తేదీ ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గం, సిరివెళ్ల గ్రామానికి రచ్చబండ కార్యక్రమంలో ఆత్మహత్య చేసుకున్న 130 కౌలు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మూడు వేల మంది కౌలు రైతులు అప్పుల భారంతో ఆత్మహత్య చేయుకున్నారని, ఈ ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా వైసీపీ కారణం రైతు దేశానికి వెన్నెముక రైతన్న ఈరోజు అప్పులబాధతో చనిపోతుంటే రైతు బతికి ఉన్నప్పుడు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం, ఎరువుల ధరలను తగ్గించని ప్రభుత్వం రైతులు చనిపోయిన తర్వాత ఏడు లక్షల రూపాయలు ఇస్తాను అనడం సిగ్గుచేటని తెలియజేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 50 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ సిరివెళ్ల గ్రామానికి వస్తున్నారని తెలియగానే స్థానిక ఎమ్మెల్యే సిరివెళ్ల కి వెళ్లి ఒక రైతు కుటుంబానికి చెక్కు ఇవ్వడానికి వెళ్లారు అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వస్తున్నారు అని భయంతో ఇప్పుడు మీకు కౌలు రైతులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. గత ఎన్నికలలో రెండు చోట్లా ఓడించబడిన వ్యక్తి ఆళ్లగడ్డలో జనసేన పార్టీ ఎక్కడుందన్న వ్యక్తులకు జనసేన సత్తా ఏమిటో సిరివెళ్ల రచ్చబండ కార్యక్రమంతో తెలుస్తుందని తెలియజేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు తక్షణమే అందేలా రైతు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అలాగే కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరివెళ్ల గ్రామంలో జరగబోయే రచ్చబండ సభలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసైనికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటసుబ్బయ్య, మద్దిలేటి యాదవ్, గుర్రప్ప, నరేంద్ర యాదవ్, ప్రసాదు, తిమ్మరాజు యాదవ్, చాకలి నరసింహ, ఆంజనేయులు, రాజారాం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.