గురాన అయ్యలు ఆధ్వర్యంలో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

విజయనగరం, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను జనసేన నేత గురాన అయ్యలు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా పైడితల్లి అమ్మవారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోట జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహరం పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం గాజులరేగ, గంజిపేట, దుప్పాడ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అనంతరం నరవ గ్రామంలో ఇండియన్​ రెడ్ ​క్రాస్ ​బ్లడ్​ బ్యాంక్​లో పలువురు రక్తదాన దానం చేశారు. అనంతరం హుకుంపేటలో జన్మదిన వేడుకలు నిర్వహించి జనసేన కిట్లు పంపిణీ చేశారు. లంకాపట్నంలో జన్మదిన వేడుకలు నిర్వహించి చీరల పంపిణీ చేశారు. అనంతరం హోటల్ జీఎస్ఆర్ వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయ్యలు కార్యాలయంలో జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో బర్త్ డే కేక్ ని కట్ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం గుర్ల మండలం కెల్ల గ్రామంలో వాలీబాల్ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా నిలదొక్కుకోవడమే గొప్ప విషయమన్నారు. ప్రజలకు జనసేన భావజాలం అవసరం ఉందని దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్నారన్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులివెందుల సంస్కృతిని రాష్ట్రంలోని అన్ని చోట్లకు తీసుకొచ్చారని తెలిపారు. వారి బెరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికలు మార్పునకు సంకేతం అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జనసేన నేతలు, వీరమహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.