రాజోలులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  • బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేకపూజలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో టేకిశెట్టిపాలెం గ్రామంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం జనసేన నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, గ్రామశాఖ అధ్యక్షులు రావూరి తేజ, సర్పంచ్ విశ తాతయ్య నాయుడు, విశ బాల నాగేశ్వరావు, లింగోలు మహాలక్ష్మి, కందులపాటి ఆంజనేయులు, బాబీ నాయుడు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • రామరాజులంకలో అన్నసమారాధన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం రామరాజులంక గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభ సందర్బంగా భారీ అన్నసమారాధన ఏర్పాటు చేసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, మండల ఎంపిపిలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, జనసేన నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రామరాజులంక జనసేన నాయకులు, జనసైనికులు, యూత్, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • సూరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు సెంటర్లో రాజోలు మండల జనసేన అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మండల ఎంపిపిలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, జనసేన నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రాజోలు జనసేన నాయకులు, జనసైనికులు, యూత్, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • తూర్పుపాలెం జనసేన ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం తూర్పుపాలెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభసందర్బంగా జనసేన నాయకులు జనసైనికులు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, మహిళలుకు చీరలు పంపణి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మండల ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, సర్పంచ్ గుళ్ళింక వీర సత్యనారాయణ, గ్రామశాఖ అధ్యక్షులు చిక్కారాము, యనుముల సూరినారాయణ మూర్తి (సూరిబాబు), అడబాల వెంకటేశ్వర, కూరసాల బాబులు, గాలిదేవర పెద్దకాపు, అడబాల నర్సయ్య, అడబాల అప్పాజీ, చింత నానబాబు, మేకల ఏసుబాబు, మంగెన హైమావతి, సుందర బ్రహ్మయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

  • గూడపల్లి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో గుడాపల్లి గ్రామంలో శ్రీ బాల కనక దుర్గమ్మ అమ్మ వారి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం గూడపల్లి మెయిన్ గ్రామంలో మెయిన్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. అనంతరం గూడపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ చిరు సేవాసమితి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, యూత్ వారు, మండల ఎంపిపి మెడిచర్ల సత్యవాణి రాము, రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, సుందర బుల్లబ్బులు, సుందర బ్రమయ్య, మేకల ఏసుబాబు, హైమావతి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు.

  • కాట్రేనిపాడులో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో కాట్రేనిపాడు గ్రామంలో జనసేన నాయకులు, జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు ఆధ్వర్యంలో భారీ చేరికలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి చాలా మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి రాజోలు జనసేన నాయకులు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి మేడిచర్ల సత్యవాణి, మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

రాజోలు జనసేన ఐటీ విభాగం ఆధ్వర్యంలో శబరి రెల్లికుల సంక్షేమ సంఘం వారికి భోజనాలు

రాజోలు నియోజవర్గం, రాజోలు గ్రామంలో శబరి రెల్లికుల సంక్షేమ సంఘం వారి వీధిలో రాజోలు నియోజవర్గం జనసేన ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా జనసేన నాయకులు, సైనికులు, వీర మహిళలు రెల్లి కులస్థులతో వారి వీధిలో సమావేశంమై వారి సమస్యలు కష్టసుఖాలు అడిగి తెలుసుని కేక్ కట్ చేసి రాజోలు ఐటీ విభాగం వారు ఏర్పాటు చేసిన భోజనాలు వారితో కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, ఐటీ విభాగం సభ్యులు అరవ సందీప్, ముత్యాల దుర్గబాబు, గరగ బస్వంత్, కొట్టు ఆదిత్య, కాపిశెట్టి సాయి పవన్, అరవ దినేష్, కూనపరెడ్డి సుధాకర్, రావూరి తేజ, కలవకొలను మణికంఠ, మణికంఠ వలవల, చింతక్రింద శ్రీనివాస్, కోలా సతీష్ తదితరులు పాల్గొన్నారు.