బొండంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
- జనసేన మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ
అరకు నియోజకవర్గ కేంద్ర పరిధిలో గల బొండం గ్రామంలో జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ, గొల్లూరి అప్పారావు తదితరుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన అధినేత పుట్టినరోజు సందర్భంగా గ్రామ పెద్దలు చేత కేక్ కటింగ్ చేయించారు. విద్యార్థి, విద్యార్థులకు పెన్నులు, నోట్ బుక్స్ లు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆనందరావు, సన్యాసి, రామచంద్ర, పూజారి అప్పలస్వామి, మొంగు గోపి. వీరమహిళ పూర్ణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-02-at-8.18.36-PM-1024x461.jpeg)