సూర్యాపేట నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకలు సూర్యాపేట నియోజకవర్గంలో శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాపేట నాయకులు రామగిరి శివసాయి ఆధ్వర్యంలో గుడిసె గౌతమ్ మరియు సూర్యాపేట నియోజకవర్గ జనసేన నాయకులు రక్త దాన శిబిరం, బైక్ ర్యాలీ, మూగ, చెవిటి పిల్లల ఆశ్రమంలో పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ మరియు పండ్లు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చింతల నాగార్జున, మోదల శంకర్, శంకర్ నాయక్, సిద్దు, హుస్సేన్, ఆకాష్, తీగల శ్రవణ్, లింగ నాయక్, సాయి కుమార్, వెలుగు గణేష్, పవన్ కళ్యాణ్, వీర, రేవంత్, పల్స జస్వంత్, పుట్ట నిరంజన్, సైదుల, వెంకటేష్, పల్స సంతోష్ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *