అనంతపురం జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

అనంతపురం జనసేన పార్టీ మహిళా కార్యాలయం నందు ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది.

• పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నాసేన… కోసం నా వంతు కార్యక్రమానికి లక్షా నుటాపదాహారురూపాయల(1,00116/-) చెక్కును జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ కి అందించిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత.

• నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి.

• రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ జనసేన

• జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను ప్రజలకు వివరించి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో వారిని కూడా భాగస్వామ్యం చేద్దామని జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ పేద,బడుగు,బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే పార్టీ జనసేన 2014 మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ తప్పులపై, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై, మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్న పార్టీ జనసేన. జనసేన పార్టీ నా సేన కోసం… నా వంతు అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిందని అందులో మేము కూడా భాగస్వాములమవుతూ శుక్రవారం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ కి నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా 1,00116/- రూపాయల చెక్కును అందించడం జరిగిందని ఆదేవిధంగా జనసేన పార్టీ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని తెలియ జేశారు.
• అదేవిధంగా పెండ్యాల శ్రీలత ని ఆదర్శంగా తీసుకొని జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు నా సేన కోసం నా వంతు లో భాగంగా 50,000/- రూపాయలు, అనంతపురం రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు 10,116/- రూపాయలు, పెండ్యాల చక్రపాణి 1000 రూపాయలు,పెండ్యాల గురు ప్రసాద్ 1000 రూపాయలు, వంశీ 1000 రూపాయలు, తోట ప్రకాష్ 500/- రూపాయలు, శరత్ 500/- రూపాయలు, వీర మహిళలు శ్రీదేవి 200/-, లక్ష్మి 200/-, సంజమ్మ 116/-, వరలక్ష్మి 116/-, భావన 116/- , శ్వేత 100/-, శైలజ 100/-, శ్రీవాణి 50/-, షాను 50/-, మౌనిక 50/-, రూపాయలను నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో ఫోన్ పే ద్వారా పార్టీకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెండ్యాల హరి, జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, కార్యక్రమాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీ.
జిల్లా కమిటీ:- జిల్లా ప్రధాన కార్యదర్శి కొడిమి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, రాపా ధనుంజయ, కిరణ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్.
నగర కమిటీ:- నగర అధ్యక్షులు బాబురావు, ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శులు పెండ్యాల చక్రపాణి, రోళ్ళ భాస్కర్, కమతం వెంకటనారాయణ, ధరాజ్ భాష, కార్యదర్శులు శ్రీమతి జక్కిరెడ్డి పద్మావతి, శ్రీమతి కుమ్మర సువర్ణమ్మ, లాల్ స్వామి, సంయుక్త కార్యదర్షులు లాల్ స్వామి, ఆకుల ప్రసాద్.
వీర మహిళలు :- శ్రీమతి కాశెట్టి సావిత్రి, శ్రీమతి శ్రీదేవి, కుమారి రూప, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి మంజులా, శ్రీమతి భావన, శ్రీమతి ఉమాదేవి, జనసేన నాయకులు తోట ప్రకాష్, కార్తిక్, పెండ్యాల గురుప్రసాద్, దండు హరీష్ కుమార్, శరత్, మధు, నజీం, వంశీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నాసేన కోసం… నా వంతులో భాగంగా జనసేన పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు ఈరోజు 164,280/- రూపాయలను పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో పార్టీకి అందించడం జరిగింది.