అడ్డతీగల జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

రంపచోడవరం నియోజవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అడ్డతీగల గ్రామంలో అడ్డతీగల జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ మదర్ తెరిసా బొమ్మ పక్కన 5 కేజీలు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అనంతరం కోవెలపాలెం గ్రామంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో కేక్ కటింగ్ చేసి 30 మంది విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, చాక్లెట్స్, బిస్కెట్స్, డ్రింక్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పాల జయరాం, పొడుగు సాయి, కర్ర నరసయ్య, ప్రసాద్, శివాజీ, బాబి, సురేష్, స్వామి, చిన్న, వీరబాబు, లోకేష్, అప్పాజీ, సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.