పొదలాడలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక

రాజోలు మండలం, పొదలాడ గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడి స్కూల్ నందు కేక్ కటింగ్ ఏర్పాటు చేసి పిల్లలకు బుక్స్, పెన్సిల్లు, స్వీట్స్ మరియు పాలు అందజేశారు. పొదలాడ గ్రామ దేవత శ్రీ శ్రీ వనవులమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూల మొక్కలు నాటారు రాజోలు మనోవికాస కేంద్రం అనాధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు అన్నిటికీ అంతర్వేది గ్రామానికి చెందిన గునిశెట్టి శ్రీను ధన సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి శీను, గుండా బత్తుల తాతాజీ, ఇంటిపల్లి ఆనంద రాజు, ఉలిశెట్టి లక్ష్మణరావు, ఉల్లంపర్తి దర్శనం, నార్ని త్రిమూర్తులు, మేడిచర్ల సతీష్, పొదలాడ జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చినబాబు పాల్గొన్నారు.