పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన మహోద్యమానికి శ్రీకారం

తాడేపల్లిగూడెం, ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని #JaganannaMosam  హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయండం అనే కార్యక్రమం గురించి శుక్రవారం ఉదయం 11 గంటలకు బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జనసేన ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాట్లాడుతూ టిడ్కో ఇల్లు పూర్తయి మూడున్నర సంవత్సరాలు పూర్తయిన ఈ ప్రభుత్వం లబ్ధిదారులకు వాటిని అప్పగించలేదన్నారు. నివాసాలకు ఏమాత్రం యోగ్యంకాని ఊరి చివర ఇళ్ల స్థలాల నుంచి జగనన్న కాలనీల అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన మహోద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెల 12, 13, 14వ తేదీల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో గృహ నిర్మాణ పథకాలు జగనన్న కాలనీలో సముదాయాలను సందర్శించి అవి ఏయే దశల్లో ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. మూడు రోజుల పాటు ఆయా కాలనీలో విస్తృతంగా పర్యటించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి.. ప్రతి అంశాన్ని ఫోటోలు వీడియో రూపంలో పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామన్నారు. జగనన్న కాలనీలో తిష్టవేసిన ప్రతి సమస్యపై జనసేన ప్రజల దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కారం అయ్యేవరకు ప్రభుత్వంపై ఉద్యమ బావుట ఎగురవేస్తామన్నారు. ఇసుక కొరత, తాగునీటి సరఫరా, విద్యుత్ లైన్లు, రహదారులు డ్రైనేజీల నిర్మాణం ఇలా ప్రతి మౌళిక సదుపాయంపై ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ప్రతి జనసేన కార్యకర్త ఈ మహోద్యమంలో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాతి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమోగుల సురేష్, జనసేన దళిత నాయకులు చాపల రమేష్, జనసేన ఉభయగోదావరి జిల్లా మహిళ కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, జనసేన సోషల్ మీడియా ఇంచార్జ్ బయణపాలేపు ముఖేష్, జనసేన నాయకులు, మాదాసు ఇందు, అడబాల మురళి, గట్టు గోపికృష్ణ, నేధూరి స్వామి నాయుడు, మేడిశెట్టి మాణిక్యాలరావు, కవల ధర్మేంద్ర, కామిశెట్టి శ్రీనివాస్, కుదుళ్ళ శ్రీనివాస్, వీర మహిళ సత్యవతి పాల్గొన్నారు.