*మాతృభాషలో విద్యాబోధనతోనే వ్యక్తి వికాసం సాధ్యం
*తెలుగు భాషా పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలి
*జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
గుంటూరు: దేశ భాష లందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో తెలుగుబాషాభివృద్ధికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి అయన పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ దేశంలోనే అధికంగా మాట్లాడే బాషల్లో తెలుగు భాష మూడో స్థానంలో ఉందన్నారు. మరోవైపు బాషను కాపాడుకోవటంలో తెలుగు వాళ్ళు మాత్రం చాలా వెనుకపడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో చదవటాన్ని మాట్లాడటాన్ని చిన్న తనంగా భావించటం దురదృష్టకరమ్మన్నారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే ఇతర బాషలను నేర్చుకోవటంలో ఎలాంటి తప్పు లేదన్నారు. కానీ మాతృ భాషలో విద్యాబోధనతోనే వ్యక్తి వికాసం సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు బాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలన్న ఆదేశాలను వాస్తవ రూపంలోకి తీసుకురావాలని అయన కూటమి ప్రభుత్వాన్ని కోరారు. అమ్మలా లాలించే, నాన్నలా కాపాడే మాతృ బాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్, బాలాజీ, నరసింహారావు రెల్లి, అలా కాసులు, కదిరి సంజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment