పవన్ కల్యాణ్ కూతురు ఆద్య ప్రత్యేక వంటకo చేసింది

పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ల గారాల పట్టి  ఆద్య యాపిల్ వీగన్ పైని అనే ఓ ప్రత్యేక వంటకాన్ని ట్రై చేసింది. ఆద్య తయారు చేసిన యాపిల్ వీగన్ పైని రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అందరి నోరూరేలా కామెంట్స్ రాసుకొచ్చింది. తన కూతురు పై తయారు చేస్తుంటే తను వంటగదిలోకి అడుగు కూడా పెట్టలేదు అని చెప్పుకొచ్చింది.

వీగన్ డిజర్ట్‌లు సాధారణ డిజర్ట్‌ల మాదిరిగా మంచివి కావు అనే అపోహను కూడా ఆద్య పూర్తిగా కొట్టిపారేసేలా చేసిందని రేణు దేశాయ్ తన కూతురిని ఆకాశానికెత్తేసింది. ఆద్య చేసిన పైలో సగానిపైగా నేనే తిన్నాను అని చెబుతూ.. పరోక్షంగా ఆద్య చేసిన పై రుచి అమోఘం అని కామెంట్ చేసింది. ఆద్య వీగన్ చేయడానికి ఎంచుకోవడాన్ని చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని.. ఆద్య పూర్తి శాఖాహారిగా ఉండటం గొప్ప విషయమని తన కూతురిని పొగడ్తల్లో ముంచెత్తింది. నా లిటిల్ ఏంజెల్‌ని ఆశీర్వదించండి అంటూ రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యాపిల్ వీగన్ పై ఫోటోను షేర్ చేసింది.