*మరణం లేని మహా నాయకుడు రంగా
*గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
పేదల కోసమే పుట్టి, పేదల కోసమే జీవించి, పేదల కోసం పోరాడుతూనే అమరుడైన స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. వంగవీటి మోహన రంగా 78 వ జయంతి సందర్భంగా శుక్రవారం శ్రీనివాసరావుతోటలోని అయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించ్చారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం పాటుబడిన వంగవీటి రంగా మరణం లేని మహా నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయాడన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా, ఎటువంటి ఆపద కలిగినా రంగన్నా అని పిలిస్తే చాలు మీకు నేనున్నాను అంటూ వారిని రంగా కంటికి రెప్పలా కాపాడుకునే వాడని కొనియాడారు. కులాలకు, మతాలకు అతీతంగా రంగా ప్రతీ ఒక్కరి గుండెల్లో సజీవంగా ఎప్పటికి ఉంటారన్నారు. రంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోరాట పటిమ, ఉన్నతమైన వ్యక్తిత్వం, కొన్ని తరాల వరకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కార్పొరేటర్ నిమ్మల వెంకట రమణ మాట్లాడుతూ ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదురుకోగల గుండె దైర్యం రంగా సొంతమన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు శ్రావణ కుమారి, సరోజినీ, విమలదేవి, బండారు రవీంద్ర, మెహబుబ్ బాషా, చింతకాయల సాయి, మిద్దె నాగరాజు, బద్రి, నైజాంబాబు, మిరియాల వెంకట్, కరీమ్, నండూరి స్వామి, జిలాని, అన్వేష్, ఫణి, వడ్డే సుబ్బారావు, యర్ర శ్రీను, స్టూడియో బాలాజీ, ఇల్లా శేషు, వెంకట్, పాలకాయల శివ, బీజేపీ రామకృష్ణ, జక్కా రాఘవులు, ములక్కాయ్ చిరంజీవి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment