జనసేనానిపై అభిమానాన్ని చాటుకున్న చిన్నారి సంహిత

తుని నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చిన్నారి సంహిత చాటుకుంది. తొండంగి మండలం, అడ్డరిపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న లెక్కల మాష్టారి కుమార్తె సంహిత. సంహిత ఇంటర్ చదువుతుంది. సంహిత జనసేనాని రూపాన్ని అచ్చుగుద్దినట్టు గీసింది. ఆయన మీద ఎంత ప్రేమ, అభిమానం ఉంటే ఇంత చక్కగా పవన్ కళ్యాణ్ బొమ్మను వేసి తన అభిమానాన్ని చాటుకుందో నిజంగా అభినందించవలసిన విషయం. ఈ సందర్భంగా సంహితకు జనసేన పార్టీ తరుపున, తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరుపున తుని నియోజకవర్గం జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ లోవరాజు పలివెల అభినందనలు తెలియజేశారు.