*జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో టిడ్కో గృహాల వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం
నెల్లూరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యం పేద ప్రజల అభివృద్ధి అని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున్ యాదవ్ అన్నారు. శనివారం టిడ్కో గృహాల వద్ద ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్ల మంజూరు కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇప్పటికే పేదల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇటువంటి విశేష అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగేందుకు కూటమి ప్రభుత్వమే అనివార్యమని, ప్రజలు గత ఎన్నికల్లో అదే నమ్మకంతో అధికారాన్ని కేటాయించారని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల, నిస్వార్థ నాయకుడు రాష్ట్రానికి అవసరమని పేర్కొంటూ, ఆయన నాయకత్వంలో పనిచేయడం తనకు గర్వకారణమని తెలిపారు. జనసేన లక్ష్యం నెల్లూరును ఆదర్శ నగరంగా అభివృద్ధి చేయడమేనని చెప్పారు. అనంతరం శనివారం వనజీవి రామయ్య మృతిని గుర్తుచేసుకుంటూ, జనసేన నాయకులు మౌనం పాటించి ఆయన స్మరణార్థంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, శ్రీపతి రాము, బోనుబోయిన ప్రసాద్, వర్షాచలం రాజేష్, పోలయ్య, షాఖీర్ దంపతులు, పి. శ్రీకాంత్, వెంకట్ తాల్లూరి, ప్రశాంత్, యాసిన్, చంటి, మహేష్, దినేష్, శాంతికల, కృష్ణవేణి, ప్రసన్నతో పాటు జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment