పవన్ కళ్యాణ్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష: నేరేళ్ళ సురేష్

గుంటూరు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసక, అరాచక పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయటమే ధ్యేయంగా జనసేన-టీడీపీ పొత్తు అంకురించిందని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఒక అసమర్థుని చేతిలో చిక్కి శల్యమవుతున్న రాష్ట్రానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. జనంలోకి జనసేన, సమస్యలపై సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పదిహేనవ డివిజన్ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో డివిజన్లోని పలుప్రాంతాల్లో పర్యటించారు. తొలుత జనసేన పార్టీ జెండాను నేరేళ్ళ సురేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్లు దాసరి లక్ష్మీ దుర్గ, యర్రంశెట్టి పద్మావతి ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని నేరేళ్ళ సురేష్, స్థానిక వీరమహిళల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ జగన్ నిరంకుశ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయన్నారు. ఎవరిని కదిలించినా జగన్ రెడ్డి అసమర్ధ పాలనపై విరుచుకుపడుతున్నారు. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలన అంతా బటన్ నొక్కే దగ్గరే ఆగిపోయిందని విమర్శించారు. వైసీపీ పాలనలో దగా పడని , మోసపోని వర్గం లేదని ధ్వజమెత్తారు. వైసీపీ దూరాగతాలను తట్టుకోలేని స్థితిలో ప్రజలున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి మళ్ళీ ఓటేందుకు వెయ్యాలో చెప్పే దమ్ము వైసీపీ నాయకులకి లేదన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తెలుసుకున్న నేతలు రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. పోటీకి భయపడి ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, ఎంపీలు ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు అంటే వైసీపీ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసి చారిత్రక తప్పు చేశాం అన్న అపరాధభావనలో ప్రజలున్నారన్నారు.రానున్న ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వైసీపీని తరిమేసేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్నారని నేరేళ్ళ సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు డివిజన్ అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పార్టీలో చేరారు. వారికి నేరేళ్ళ సురేష్, గాదె వెంకటేశ్వరరావులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, వీరమహిళ పాకనాటి రమాదేవి, కొల్లా పద్మావతి, బత్తుల భవాని, రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, నగర ఉపాధ్యక్షులు చింతా రాజు, సూరిశెట్టి ఉదయ్, జిల్లా, నగర కమిటీ సభ్యులు, పలు డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.