పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ పాదయాత్ర

గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, కండ్రిక గ్రామం నుంచి తాటి నవీన్ కుమార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన సీఎం కావాలనే ధ్యేయంతో కండ్రిక గ్రామం నుంచి అడిగొప్పల వరకు పాదయాత్ర చేస్తున్న తాటి నవీన్ కుమార్ కు ఎస్.డి.నాగూర్ వలి, నకరికల్లు మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ యక్కలదివి గాంధీ, నేమిలి కంటి పుల్లయ్య, జనసైనికులు గుడ్లపల్లి గ్రామంలో వారికి స్వాగతం పలకడం జరిగింది. పవన్ కళ్యాణ్ సీఎం అయితే మా కష్టాలు తీరిపోతాయంటూ అతని గుండెల్లో నుంచి వచ్చిన మాట ఆయన సీఎం అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, రైతులకి గిట్టుబాటు ధర లభిస్తుందని ఆ అభిమాని అన్నారు. అందుకని ఫిరంగీపురం నుంచి దుర్గి మండలం అడిగోప్పల అమ్మవారి దగ్గర దాకా చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నారు. ఫిరంగిపురం నుంచి అడిగొప్పల అమ్మవారు గుడి దగ్గరికి 110 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని నాకంతకంటే ఇంకేమి వద్దని ఆయనని సీఎంగా చూడాలని అభిమాని తాటి నవీన్ కుమార్ అన్నారు.