పవన్ కొత్త లుక్.. వైరల్ అవుతున్న ఫొటోస్..

ఆదివారం నుండి వకీల్ సాబ్ షూటింగ్ ప్రారంభించిన పవన్ గిరజాల జుట్టును గడ్డంను కత్తిరించి  చాక్లెట్ బోయ్ గెటప్ కి షిఫ్టయిపోయారు. చాలా సింపుల్ గా ఫుల్ హ్యాండ్ టీషర్ట్ డెనిమ్స్ లో స్మార్ట్ గా కనిపించారు పవన్ కల్యాణ్. ఈ లుక్ చూస్తుంటే ఖుషీ రోజులు గుర్తుకొస్తున్నాయి.  తన స్నేహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పవన్ ఇలా సెట్లో కనిపించారు. వకీల్ సాబ్ కి సంబంధించి పవన్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు వేణు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపించగా, ఆ చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలాకాలం తరువాత గడ్డం లేకుండా పవన్ కనిపించగా..  మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా ఆ చిత్రం కోసమే పవన్ కల్యాణ్ తన లుక్ ను మార్చుకున్నారని తెలుస్తోంది.