పరకాలవ ప్రాంతంలో జనం కోసం పవన్-పవన్ కోసం

కాకినాడ రూరల్ నియోజకవర్గం: రూరల్ మండలం సూర్యారావు పేట గ్రామం పరకాలవ ప్రాంతంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సూర్యారావు పేట పరకాలవ ప్రాంత జనసేన నాయకులు గుబ్బల ప్రసాద్, తోలుం సత్తిబాబు, వాసం శెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, మరియు తెలుగుదేశం నాయకులు సీతయ్యాదొర, ఎజ్జల బాబ్జి, తోలుం రామకృష్ణ. ఈ ప్రాంతంలోని ప్రజలు పంతం నానాజీకి వారి సమస్యలను తెలిపారు. పరకాలవ నుండీ పోలవరం వెళ్లే దారిలో బ్రిడ్జి దిగిపోవడంతో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు అంతరాయము కలుగుతోంది, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ లైట్స్ లేవు, విద్యార్థులు చదువు కోవడానికి గ్రంధాలయం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, పంట పొలాల మధ్యలో విద్యుత్ వైర్లు ఉండడం వల్ల రైతులు, కూలీలు ప్రమాదానికి గురిఔతున్నారని, పంచాయతీ పారిశుధ్య సిబ్బంది చెత్త ను పంట పొలాల్లో వేస్తున్నారని, దాని వల్ల పంటలు పాడవుతున్నాయని, త్రాగునిటీ సమస్య ఉందని తెలిపారు. కొద్దిరోజుల వ్యవదిలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, ఎల్లబోయిన రామకృష్ణ, గరికిన సురేష్, సోదే ముసలయ్య, మల్లె భాస్కర్, సురడా శ్రీను, తదితరులు, జనసేన యువత మరియు తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.