‘గమనం’.. ట్రైలర్ విడుదల చేసిన పవన్

శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `గమనం`. ఈ చిత్రాన్ని ఏక కాలంలో ఐదు భారతీయ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సుజనా రావు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రియ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని క్రిష్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ని ఐదు భాషల్లోనూ ప్రముఖ హీరోలు విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ `వకీల్‌సాబ్‌` లొకేషన్‌లో రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను  విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు పవన్‌కల్యాణ్.

చెవులు వినిపించని ఓ పెళ్లైన అమ్మాయి.. ఆమెకు పుట్టిన బిడ్డ, ఆమెను విడిచిపెట్టేసి భర్త దుబాయ్‌ వెళ్లిపోయాడు, ఓ గాయకురాలు, ఓ ప్రేమ జంట..అందులో క్రికెటర్‌గా రాణించాలనుకునే యువ, అనాథలైన ఇద్దరు పిల్లలు.. ఇలాంటి వారి భావోద్వేగాలు, వీరందరూ భారీ వర్షాల్లో చిక్కుకున్నప్పుడు వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే కథాంశంతో సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ ఈ చిత్రానికి విజువల్స అందించడంతో పాటు రమేశ్‌, వెంకీతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు.