కొత్త వ్యవసాయ విదానానికి పవన్ శ్రీకారం

చారెడు నేల-బతుకు బాట అనే ఆలోచనతో కొత్త వ్యవసాయ విధానానికి పవన్‌ కల్యాన్‌ శ్రీకారం చుట్టారు. ‘కొద్దిపాటి స్థలంలో సాగు చేసి ఆదాయం పొందే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించబోతున్నాం’ అని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ప్రముఖ ప్రకృతి రైతు విజయరామ్‌ సలహాసహకారాలతో శనివారం తన వ్యవసాయ క్షేత్రంలో పవన్‌ కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ యువత, రైతులకు ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ విజ్ఞాన విషయాలను పంచే కార్యక్రమాన్ని చేపట్టామని అది కూడా చిన్నపాటి భూమిలో సాగు చేయడం ఎలాగో తెలియచేస్తామన్నారు. 250 గజాల్లో 81 మొక్కలను ఒక క్రమ విధానంలో నాటి సాగు చేయడం ద్వారా ఏ విధంగా ఫల సాయం పొందగలమో వివరిస్తామని పేర్కొన్నారు. చారెడు నేల- బతుకు బాట అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఉంటుందని, ప్రణాళిక ప్రకారం అవగాహన కల్పిస్తామని వివరించారు.