పవన్ ఢిల్లీ పర్యటన .. బీజేపీ పెద్దలతో భేటీలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తెలుగు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకుని బీజేపీకి జనసేన మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పవన్ సమావేశం అయిన తరువాత జనసేన బీజేపీ కలిసి నడిచే విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే టాక్ వస్తోంది ఈ నేపధ్యంలో త్వరలో జరుగబోతోన్న తిరుపతి ఎంపీ బై పోల్ లో తమకు మద్దతివ్వాలని జనసేన అధినేత హస్తిన బీజేపీ పెద్దలతో మాట తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కలుస్తోన్న పవన్ వెంట జనసేన పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు.