పవన్ వ్యాఖ్యల్లో తప్పేలేదు.. వర్ల రామయ్య ట్వీట్

రెండు రోజులుగా జరుగుతున్న వైసీపీ, జనసేన డైలాగ్ వార్ లోకి టీడీపీ నేత వర్ల రామయ్య ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వైసీపీ గ్రామసింహాల గోంకారాలు ట్వీట్ పై స్పందించారు. పవన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పే లేదన్నట్టుగా సమర్ధిస్తూ ట్వీట్ చేశారు వర్ల రామయ్య.

వర్ల రామయ్య చేసిన ట్వీట్

పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయంగా బాగా పరిణతి చెందారు. ప్రత్యర్థుల బూతు పురాణాలకు స్పందించకుండా, వారి అసభ్య పదజాలాన్ని జంతువుల ఘీంకారాలతో పోల్చి చావుదెబ్బ కొట్టారు. మరి, ఈ బూతు ప్రవచనా శ్రేష్ఠులకు, కవి హృదయం అర్ధమౌతుందా నటశ్రేష్టా..? మన రాష్ట్రాన్ని ప్రస్తుతం ఆ దేవుడే కాపాడాలి.