సుండుపల్లిలో దిగ్విజయంగా కొనసాగిన పవన్ అన్న ప్రజా బాట

రాజంపేట నియోజకవర్గం: సుండుపల్లి మండలంలోని పలు గ్రామాలైన పించా, పించా హరిజనవాడ, ముడుంపాడు క్రాస్, తిమ్మారెడ్డి పల్లె, కురవపల్లి, పెద్దపల్లి, చెరుకువాండ్లపల్లి, బట్ రాజుగారు పల్లెల లో 135వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లె వీర మహిళ సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ,వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ, మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు.రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి పార్టీ మద్దతుదారున్ని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర పంతులు,చౌడయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు సుగుణమ్మ, లక్ష్మమ్మ, శిరీష, మాధవి తదితరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *