పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం 33వ రోజు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో “పవనన్న చేనేత బాట-చీరాల నియోజకవర్గం” 33వ రోజు బుధవారం పర్యటన వేటపాలెం మండలం, దేశాయి పేట పంచాయతీ పరిధిలో రామా నగర్ కాలనీలో కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పసుపులేటి సాయి(పందిళ్ళపల్లి) పాల్గోన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుడు బొడ్డు శంకరయ్య మాట్లాడుతూ హ్యాండ్లుమ్ రంగానికి చెందిన 21 రకాలలో (జి.ఓ పరంగా ఇచ్చిన) పవర్లుమ్(పవర్ లూమ్) వాళ్ళు 11 రకాలు అనధికారకంగా యంత్రాల మీద నేయిస్తు చేనేత రంగ కార్మికులు కుదేలు అయ్యెటట్టు చేస్తున్నారు అని అభిప్రాయ పడినారు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే విధంగా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం జరిగింది.