పవనన్న చేనేతబాట ఆత్మీయ సమావేశం

చీరాల, జనసేన పార్టీ చీరాల నియోజకవర్గంలో చేనేతల సమస్యలను ఆ సమస్యల పరిష్కారం దిశగా చీరాల నియోజకవర్గం చేనేతపురి గ్రామానికి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పర్యటించి చేనేత కళాకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముందుగా బైక్ ర్యాలీతో పందిళ్ళపల్లి బ్రహ్మం మఠం నందు గ్రామ మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుండి బైక్ ర్యాలీగా రామన్నపేట, వేటపాలెం మీదుగా చేనేతపురి గ్రామంలోకి తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చేనేత కార్మికుడు బొడ్డు భవాని శంకర్ మాట్లాడుతూ చేనేత మహిళలు గర్భధారణ సమయంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చిల్లపల్లి దృష్టికి తీసుకురావడం జరిగింది. గర్భం దాల్చిన సమయంలో నాలుగు నెలల నుంచి ప్రసూతి అయిపోయిన తర్వాత నాలుగు నెలల సమయంలో మగ్గం నేసే పరిస్థితి ఆ మహిళకు అవకాశంలేని కారణంగా ఉత్పత్తి తగ్గి పోతాయి కుటుంబం పరంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఇటువంటి మహిళలకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించడం లేదని చెప్పడం జరిగింది. ఈ సమస్య మీద చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఇటువంటి మహిళల సమస్యలను ప్రత్యేక కేటగిరీగా తీసుకొని ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలానే ఒక చేనేత కార్మికుడు నేసే వస్త్రం పైన బార్ కోడ్ అనే విధానాన్ని తీసుకువస్తే ఆ బార్ కోడ్ మీద వచ్చే జీఎస్టీని ఆ నేసిన కార్మికుడికి అందించే కార్యక్రమం చేస్తే కొద్ది మేరకు ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నేతన్న మేచే వస్త్రం మీద బార్కోడ్ విధానం తీసుకువచ్చి దాని మీద వచ్చే జీఎస్టీని ఆ నేత కార్మికుడికి నేరుగా సబ్సిడీగా ఇచ్చే ప్రయత్నం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. పవనన్న చేనేత బాట యువకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కమిటీ కార్యదర్శి వజీర్ భాష, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్ లతో చీరాల నియోజకవర్గ జనసైనికులు, చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి చేనేత క్లస్టర్ ఇచ్చి విజయవంతం అవ్వడానికి సహకరించినటువంటి చేనేతపురి గ్రామస్తులందరికీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.