డాక్టర్ కందుల ఆధ్వర్యంలో పవనన్న ప్రజా బాట

  • 102 వ రోజుకు చేరిన కార్యక్రమం
  • కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు
  • పెళ్లి కుమార్తెలకు, పుష్పవతి అయిన అమ్మాయికి సహాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 102 వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు వార్డులలో ఆయన పర్యటించారు.
సందర్భంగా ఇద్దరు పెళ్లి కుమార్తెలకు, పుష్పవతి అయినా ఒక అమ్మాయికి ఆయన సహాయం చేశారు. 39వ వార్డుకు చెందిన పెళ్లి కుమార్తె శ్రీవిద్య, 37వ వార్డుకు చెందిన పెళ్లి కుమార్తె మౌనికకు తాళిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకుమ అందజేశారు. అలాగే 39 వ వార్డుకు చెందిన పుష్పవతి అయిన అమ్మాయి రమకు పట్టు బట్టలు, వెండి పట్టిలు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని అని చెప్పారు. వర్గాలకు, మతాలకు, కులాలకు అతీతంగా అందరికీ సేవ చేయడమే తన లక్ష్యంగా చెప్పారు.
ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ముందు ఉంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ హెచ్ ఎస్ నాగభూషణ్, జనసేన పార్టీ నాయకులు
గరికిన రవి, ఎర్రం శెట్టి సురేష్, ప్రణీత్, కందుల కృష్ణ, వరదశ్రీను, జయ, ప్రసాద్, గణేష్, కాసు బాబు, పద్మ, మంగ, శ్రీదేవి, కోదండమ్మ, లలిత, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.