ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట – కరపత్రాలను అందజేస్తున్న రాటాల రామయ్య

ఒంటిమిట్ట: పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట 65వ రోజుకు చేరుకుంది. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఒంటిమిట్ట మండల పరిధి కొత్త మాధవరం పంచాయతీ ఎస్సీ కాలనీ గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవనన్న ప్రజా బాట సాగుతుంది. ఈప్రాంత ప్రజల ఇబ్బందులు తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈసందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.