కారంపల్లి పంచాయతీలో పవనన్న ప్రజాబాట

  • రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రాజంపేట జనసేన నాయకులు
  • పవనన్న ప్రజాబాట 59వ రోజు

రాజంపేట: రాష్ట్ర అభివృద్ధి కొరకై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని రాజంపేట జనసేన నాయకులు అన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 59వ రోజు సోమవారం రాజంపేట మండలం, కారంపల్లి పంచాయతీలోని పలు గ్రామాలలో జనసేన నాయకులు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన సిద్ధాంతాలు, ఆశయాలు హామీలతో కూడుకున్న కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధికై జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య, వీరయ్య ఆచారి, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, మాధవి, జనసేన కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొనడం జరిగినది.