ఓటిఎస్ కట్టని వారికి పింఛన్ ఆపేయడం సరికాదు – జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా

అరకు నియోజవర్గం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వన్ టైం సెటిల్మెంట్ పట్ట పేరుతో 10 వేల రూపాయలు వసూలు చేసే విధానాన్ని తీసుకువచ్చాకా, ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఒకపక్క ప్రతిపక్షాలు, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ నేపథ్యంలో చేతగాని ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ కింద పదివేల రూపాయలు కట్టని వాళ్లకి కుటుంబములో పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులకు పింఛన్ ఆపేయాలని గ్రామ వార్డు స్థాయిలో వాలంటీర్లకి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంఫై దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జనసేన పార్టీ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ సాయిబాబా, గెమ్మెలి సన్యాసిరావు, రామకృష్ణ, అల్లంకి, ఎల్బీ రవీంద్ర, కోటేశ్వరరావు పడ ల, పరసురంబుద్దు తదితరులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.