బిగ్ బాస్ బ్యూటీకి పవన్ సందేశం..!

బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొన్న హిమజ అంతకముందు పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. బిగ్ బాస్ షో తర్వాత ఈ అమ్మడి లైఫ్ పూర్తిగా మారింది. ఖరీదైన కారు, పలు టీవీ, సినిమా ఆఫర్స్‌తో మాస్త్ మజా చేస్తుంది. రీసెంట్‌గా పవన్‌- క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోను తనకు ఆఫర్ దక్కిందని తెలిపింది హిమజ. పవన్‌తో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ పవన్‌తో కలిసి నటించే అవకాశాన్ని ఇచ్చినందుకు క్రిష్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.

ఇక తాజాగా పవన్ కల్యాణ్ తనకు ఆల్ ది బెస్ట్ చెబుతూ రాసిన సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇందులో హిమజ గారికి అన్ని శుభాలు కలగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కల్యాణ్.” అని ఉంది. పవన్ తన స్వదస్తూరితో రాసి సందేశం పంపడంతో ఫుల్ ఖుష్ అవుతున్న ఈ అమ్మడు నా ఫీలింగ్‌ని ఏ పదాలు, ఏ ఎమోజిస్ కూడా వ్యక్తపరచలేవు అంటూ ఓ కామెంట్‌ని తన పోస్ట్‌కు పెట్టింది.