పవన్ విశాఖ టూర్ అంటే వైసీపీకి ఎందుకంత భయం?: దారం అనిత

మదనపల్లె, ఈనెల 15వ తేదీన ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు విశాఖ వెళ్తుంటే మంత్రులకు ఎందుకంత ఉలికిపాటు? క్యాపిటల్ పేరుతో చేస్తున్న డ్రామాలు తెలిసిపోతాయని భయమా? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పవన్ ప్రశ్నిస్తారని భయమా ఉత్తరాంధ్ర సెంటిమెంటుతో విద్వేషాలు రెచ్చగొట్టలేమని భయమా లేదా చేసిన అక్రమాలను ఎండగడతారని భయమా మరి దేనికి భయం దేనికి పవన్ అంటేదేనికి అంత అక్రోశం? ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలం మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు ఆ తప్పును ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బయటకు తీస్తారు. జనసైనికులు మీ తాట తీయడానికి సిద్దంగా ఉన్నారని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.