పవర్ స్టార్ పాటలపై ఉన్న శ్రద్ద.. మీ డ్యూటీపై లేదా.. పోలీసులపై నెటిజెన్ల ఆగ్రహం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట అలా రీలీజ్ అయ్యిందో లేదో వెంటనే ఆ పాటపై రివ్యూ రాసిన హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి రమేష్ ఇప్పుడు ఆయన పరిధిలో పీఎస్ లోనే సైదాబాద్ అత్యంత పాశవిక సంఘటన జరిగింది. ఆరేళ్ళ పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మొత్తం సమాజాన్నే తల దించుకునేలా చేసింది. అయితే ఈ ఘటనను ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ప్రతిపక్ష నాయకులూ రేవంత్ రెడ్డి తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో క్రమేపి మీడియా ఫోకస్ చేయటంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు అప్పటి వరకు నిందితున్ని పట్టుకున్నాం అనే భ్రమ కల్పించి తీరా నిందితుని ఫోటోలు బయటకి రీలీజ్ చేసి పట్టిస్తే పది లక్షలు అని ప్రకటించారు.

ఇప్పుడు హైదరాబాద్ పోలీసులపై నెటిజెన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. సైదాబాద్ సంఘటన జరిగిన ప్రదేశం ఈస్ట్ జోన్ కిందకి వస్తుండటంతో ఆ జోన్ డిసిపి రమేష్ ను నెటిజన్లు తెగ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాటలపై ఉన్న శ్రద్ద డ్యూటీపై పెడితే ఆ పాప కనీసం బతికేదని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పాప కనిపించటం లేదని సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, మాకు అనుమానం ఒక వ్యక్తిపై ఉందని దయచేసి ఆ వ్యక్తి ఇంటిని చెక్ చేయాలనీ చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. 6 గంటలకు ఫిర్యాదు చేస్తే రాత్రి 12 గంటలకు పోలీసులు ఆ వ్యక్తి ఇంట్లో వెతికితే అప్పుడు అసలు విషయం బయటపడటంతో స్థానిక ప్రజలు పోలీసుల పనితీరుపై మండిపడ్డారు.