Paytm మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది

గ్యామ్బ్లింగ్ యాప్‌ విధానాలను అరికట్టేందుకు పేటీఎం ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలిగించిన కొద్ది గంటల్లోనే మళ్లీ అందుబాటులోకి వచ్చేసింది. యూజర్లు ఇంతకముందు మాదిరిగానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని.. అందరి డబ్బులు, లింక్డ్ అకౌంట్స్ భద్రంగానే ఉన్నాయని పేటీఎం ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లలో కూడా మా సేవలు పూర్తిగా పని చేస్తాయని స్పష్టం చేసింది.

కాగా, ఆన్లైన్ జూదాలు, బెట్టింగులు నిర్వహించడంతో పేటీఎం, పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన పేటీఎం మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని.. యూజర్ల సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని ప్రకటించింది.