డా.బి.ఆర్ అంబేద్కర్ కు పిసిని చంద్రమోహన్ ఘన నివాళులు

శ్రీకాకుళం పట్టణం, ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో డా.బిఆర్.అంబేద్కర్ కాంశ్య విగ్రహం నెలకొల్పిన నేపథ్యంలో ఆయన 134 వ జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల సామాజిక, అర్ధికసాధికారత కోసం జీవితాంతం తపించిన మహనీయుడు అంబేద్కర్ ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీనవర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో వారికి ఖచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్. భారతరత్న రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు, జిల్లా ప్రధానకార్యదర్శి కూరాకుల యాదవ్, జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శిలు ఉదయకుమార్, కొండ్ర వరప్రసాద్, మెట్ట అవినాష్, జిల్లా సంయుక్త కార్యదర్శులు గురుప్రసాద్, చిట్టి బష్కర్, మహ్మద్ రఫీ, శ్రీకాకుళం జనసేన పట్టణ నాయకులు పాండ్రంకి రాజేష్ నాయుడు, వాడవలస సురేష్ కుమార్, కామేష్, ముంగి జగదీష్, శ్రీకాకుళం జిల్లా జనసేన వీరమహిళలు బొడ్డు మోహన్ లక్ష్మి, గొర్లె అనురాధ, లతా, లక్ష్మి, జనసేనపార్టీ శ్రీకాకుళం పట్టణ ముఖ్య నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment