*ప్రజల అవసరాలే మా లక్ష్యం.. జనసేన నేత రామ్మోహన్ రావు
ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని సొట్టవానిపేట కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చేతి పంపును నియోజకవర్గ శాసనసభ్యులు కూన రవికుమార్ సమక్షంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య స్థానికులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. ప్రజల నిత్యవసరాలను గుర్తించి, వేగంగా స్పందించడమే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు.
Share this content:
Post Comment