రైతులకు అండగా పేడాడ రామ్మోహన్

శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం, చిన్నకగితపల్లి పంచాయతీ, బుడ్డివలస గ్రామంలో పంట పొలాలు మునిగిపోవడంతో అక్కడ రైతులు సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. రైతులను ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు కొన్ని దశాబ్దాలుగా కుడి కాలువ 11ఎల్ వరద నీరు కారణంగా సుమారు 20 గ్రామాలు, 8 పంచాయితీలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వీరభద్రపురం, బడ్డివలస, తురకపేట, సవలపురం, ఇసుకాల పాలెం, పెద్ద సవలపురం, పురుషోత్తం పురం, పాలవలస,పెద్ద వెంకటాపురం, ఇలా దాదాపు కొన్ని గ్రామాలు రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని చేయవలసిన కనీసపు కాలువలో పేరుకు పోయిన గుర్రపుడెక్క తీసే పరిస్థితి కూడా లేకపోవడంతో స్వయంగా రైతులే ఆ పనిని చేయడంతో ప్రమాదానికి గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా.. అని ప్రశ్నించారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి రైతన్నకు అండగా ఉండాలి అని డిమాండ్ చేశారు.