జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన పేడాడ రామ్మోహన్ రావు

ఆమదాలవలస: పొందూరు మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుల కుటుంబాలను సోమవారం నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పరామర్శించారు. అందులో భాగంగా వెన్నెముక నొప్పితో బాధపడుతున్న నందివాడ గ్రామానికి చెందిన జనసైనికుడు పిసిని అప్పలనాయుడు తండ్రిని మరియు కాలు నొప్పితో బాధపడుతున్న లైదాం గ్రామ జనసైనికుడు దినేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు యలకల రమణ, కొంచాడ చిన్నమనాయుడు, రాంబాబు, లక్ష్మణ్, శ్రీరామ్, రాజు మరియు గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.