పెదఏరుకపాడు స్మశాన వాటిక అభివృద్ధి చేయాలి: ఆర్కే వారియర్స్

గుడివాడ: కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ స్థానిక 25వ వార్డు పెద్ద ఎరుకుపాడు గ్రామ ప్రజల స్మశాన వాటిక అభివృద్ధి చేయాలని ప్లకార్డులతో గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ పెద ఎరుకపాడు వార్డులో కొన్ని సంవత్సరాలుగా స్మశాన వాటిక అభివృద్ధి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చివరి దశలో మనిషి చనిపోతే కాడి మోసే నలుగురు మనుషులు బురద మట్టిలో నడుచుకుంటూ ముళ్ల పోదలు దాటుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతూ అంత్యక్రియలు చేస్తున్నారని దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పెదఏరుకపాడు వార్డ్ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరారు. కనీసం ఆ ముళ్ళ పోదలను తొలగించి, ఎత్తుగా మట్టి తోలించి స్మశాన వాటిక చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ వడ్లని మురళీకృష్ణ గారికి వినతి పత్రం ద్వారా అందజేయడంతో వారు వెంటనే స్పందించి పది రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, మట్టా జగదీష్, చరణ్ తేజ్, ఘంటా అంజి, దివిలి సురేష్, చరణ్, శివ, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.