సుబ్బారాయుడు సత్రం ప్రజలకు సంఘీభావం తెలిపిన పెదపూడి విజయ్ కుమార్

నెల్లూరు జిల్లాలో, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, సుబ్బారాయుడు సత్రం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వేసినట్లయితే ప్రజలకు ప్రాణహాని ఉంది అని గ్రామస్తులందరూ గత మూడు రోజుల నుంచి టెంటులు వేసుకొని, ఆందోళన చేస్తూ, ధర్నా చేయడం జరిగింది. సుబ్బారాయుడు సత్రం గ్రామ ప్రజలందరికీ మద్దతుగా మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ మద్దతుగా సోమవారం ఉదయం ఆ గ్రామస్తులు వద్దకు చేరుకొని సంఘీభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, లక్ష్మణ్ బాలచంద్ర మరియు ఉలవపాడు మండలం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.