పెద్దపాలెం జనసేన ఆత్మీయ సమావేశం

ఆమదాలవలసల నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పెద్దపాలెం గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అక్కడ జనసేన నాయకుడు మురాల మిన్నరావు ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో పాల్గొని కార్యకర్తలని మరియు వీరమహిళలని ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ప్రసంగించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పెద్దపాలెం గ్రామంలోని 85 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి జడ్పిటిసి అభ్యర్థి పైడి మురళీ మోహన్, కొండవలస గ్రామ వీర మహిళ అయిన తోట సునీత మరియు మండలనాయకులు రమణ, ముడాడ్ల సత్యనారాయణ, జనార్ధన, రామకృష్ణ, వాసు, సంతోష్, శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.