సర్పంచిగా చేసిన వృద్ధమహిళకు పెద్దాపురం జనసేన భరోసా

పెద్దాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బడుగు బలహీనవర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయంపై గళం విప్పిన జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకర కృష్ణవేణి. ఒక బీసీ మహిళ అక్కడ గ్రామ సర్పంచిగా పనిచేసినప్పటికీ కూడా ఆమె వృద్ధాప్యంలో కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఆమెను చూసి చలించిపోయిన పెద్దాపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి తుమ్మల రామస్వామి (బాబు) మరియు జనసెన నాయకులు అండగా ఉంటామని భరోసానివ్వడం జరిగింది.