*ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న జనసేన నేత గునుకుల కిషోర్
ఆత్మకూరు నియోజకవర్గం జెండా దిబ్బ పీర్లసావిడి వద్ద మొహరం సందర్భంగా నిర్వహించిన పీర్లపండుగలో హిందూ, ముస్లింలు కులమతాలకతీతంగా కలిసిచేరి వేడుకలు నిర్వహించారు. ఈ మతసామరస్య పండుగలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, నాయకులు రహమాత బాషా, సుల్తాన్, కర్రిముల్లా, మహమ్మద్, మన్సూర్, ఇస్మాయిల్ లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. శతాబ్దాలుగా ప్రజలు ఆధ్యాత్మికతతో పాటు ఏకత్వాన్ని సాక్షిగా చేసుకుంటూ జరుపుకుంటున్న ఈ పండుగలో గునుకుల కిషోర్ మాట్లాడుతూ – “ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కూటమి ప్రభుత్వం మరింత మంచి పాలన అందించాలని ప్రార్థించాం,” అని తెలిపారు.
Share this content:
Post Comment