శనివారంనాడు ఎండాడలోని పెన్ స్కూల్లో “పెన్ మినీ ఒలింపిక్స్” పేరిట ఘనంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరాపల్లి మండలం తాసిల్దార్ శ్రీమతి పొన్నగంటి లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో నర్సరీ నుండి మూడో తరగతి విద్యార్థులు వివిధ రకాల ఆటలు ఆడారు, అవి చక్కగా నిర్వహించబడిన పరేడ్, బ్యాలెన్సింగ్ రేస్, ఫ్లవర్ డ్రిల్, ఫిల్లింగ్ ది బాస్కెట్ రేస్, మాస్ పీటి, ఫిల్ ఇన్ ది బాటిల్ రేస్, పొమ్ పొమ్ ఫ్యాన్సీ డ్రిల్ తదితర ఆటలు. ఈ ఆటలు పాల్గొన్న చిన్నారులను ఎంతో ఉత్సాహంగా ఆడించాయి. అంతేకాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ ఆటల్లో పాల్గొనడం ప్రత్యేకమైన అంశం. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి పి. లక్ష్మీదేవి గారు చిన్నప్పటి నుంచి శారీరక శ్రమ, ఆటల ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన శక్తిని ఇచ్చే విషయాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు విద్యార్థులను ఉల్లాసంగా ఉంచుతాయనీ, ఆటలతో శారీరక దృఢత్వం కలిగిస్తాయని తెలిపారు. పెన్ స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి అనిత పెరీరా మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రీడలు కూడా ఎంతగానో అవసరమని, పిల్లలు మొబైల్ ల నుంచి దూరంగా ఉండేందుకు ఇలా ప్రతీ సంవత్సరం “పెన్ ఒలింపిక్స్” పేరిట స్పోర్ట్స్ మీట్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ముఖ్య అతిథి చేతుల ద్వారా ప్రదానం చేయడం జరిగింది. చివరగా, వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this content:
Post Comment