పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా మార్చాలి

పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం కానూరు గ్రామం అనే రామ తులసి కళ్యాణ మండపంలో జరిగిన జనసేన పార్టీ మండల కమిటీ సమావేశంలో పెనమలూరు మండల అధ్యక్షులు కరిమికొండ సురేష్ మాట్లాడుతూ పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి అసాధారణ ఓటు బ్యాంకు ఉంది, వాళ్ళందర్నీ ఒక తాటి మీదకు తెచ్చి రాబోయే 2024 ఎలక్షన్స్ లో అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రకటించినా వారిని అఖండ మెజార్టీతో గెలిపించి పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా మార్చాలని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరావు, ప్రధాన కార్యదర్శి పండమనేని శ్రీనివాస్, కృష్ణాజిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీగా లోకేష్ పాల్గొన్నారు.