- కలెక్టర్ ను కోరిన డాక్టర్ కందుల
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 32వ వార్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, తన హయాంలో 32వ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సహకారంతో అభివృద్ధి పనులు మరింత చురుకుగా సాగుతున్నాయని, అయితే వార్డులో ఇంకా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వార్డులోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగానికి సమస్యలను వివరిస్తూ మెమోరాండం అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఏడు గుళ్ళ స్లమ్ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. అలాగే, చలువ తోటలో కళ్యాణ మండపం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, వార్డులో ఉన్న మిగతా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చొరవ చూపించాలని డాక్టర్ కందుల నాగరాజు విజ్ఞప్తి చేశారు.
Share this content:
Post Comment